ఐపీఎల్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రేక్షకులకు కావలసిన దానికంటే ఎక్కువ క్రికెట్ మజాను అందిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయ్. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా  మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా ఐపీఎల్ మ్యాచ్లు ఉత్కంఠ  భరితంగా జరుగుతున్న సమయంలో అటు బీసీసీఐ కూడా జరిమాణాలు విధించడం విషయంలో బిజీబిజీ గానే ఉంది అని చెప్పాలి. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన కూడా ఉపేక్షించేది లేదు అన్న విషయాన్ని భారీ జరిమానాలు విధించడం ద్వారా చెప్పకనే చెబుతుంది బీసీసీఐ. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంతో ఎన్నో జట్ల కెప్టెన్లకు జరిమాణాలు విధించింది.



 ఇక ఇలా బీసీసీఐ విధించిన జరిమానాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం పొందుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ టైటిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా గెలిచిన కోల్కతాకు ఊహించిన షాక్ ఇచ్చింది బీసీసీఐ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వారి సొంత మైదానం అయిన చపాక్ స్టేడియంలోనే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓడించింది. దీంతో ఆనందంలో మునిగిపోయింది ఆ టీం. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే కోల్కతా జట్టుకు భారీ జరిమానా విధించింది బీసీసీఐ.



 చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకుగాను ఐపీఎల్ నిర్వహకులు జరిమానా విధించారు. కోల్కతా కెప్టెన్ నితీష్ రాణకు 24 లక్షల జరిమానా విధించగా.. ఇంపాక్ట్  సబ్స్టిట్యూట్తో సహా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉన్న ఆటగాళ్లు అందరికీ కూడా ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% చొప్పున జరిమానా విధించారు. అయితే ఇలా ఈ ఐపిఎల్ సీజన్లో24 లక్షల భారీ జరిమానా పడిన రెండవ కెప్టెన్ గా నితీష్ రానా నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీకి ఇలా 24 లక్షలు జరిమానా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl