భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తే అటు కామరూన్ గ్రీన్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచాడు. అప్పుడెప్పుడో సన్రైజర్స్ పై జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన గ్రీన్.. ఆ తర్వాత మాత్రం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లు ఆడలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సీజన్లో అతనికి దక్కిన ధరకు అతను న్యాయం చేయలేకపోయాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో సైతం కీలకమైన వికెట్లు పడ్డప్పుడు.. ఎంతో నిలకడైన ఇన్నింగ్స్ ఆడాల్సిన కామరూన్ గ్రీన్ ఇక 20 బంతుల్లో 30 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు.



 అయితే అలాంటి కామరూన్ గ్రీన్ ఇటీవల ఐపీఎల్ లో అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకున్నాడు. అయితే ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్.. నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కి మాత్రం అతను పక్కన పెట్టేసాడు అని చెప్పాలి. సాధారణంగా ఐపీఎల్లో స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏవి అంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అని చెబుతూ ఉంటారు. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ కూడా ఇవే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ విజేత గా నిలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. మిగతా ఏ జట్టు కూడా ఈ టీమ్స్ కి టైటిల్స్ గెలవడంలో చేరువలో లేదు అని చెప్పాలి. ఇంతకీ కామరూన్ గ్రీన్ ఏమన్నాడంటే..  అత్యుత్తమ ఆటగాళ్లపరంగా గుజరాత్ జట్టు బలమైన టీం అంటూ చెప్పుకొచ్చాడు. అన్ని విభాగాల్లోనూ ఆ టీం ఎంతో పటిష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబైని ఫైనల్ చేరిన చెన్నైని కాకుండా గుజరాత్ స్ట్రాంగెస్ట్ టీమ్ అని గ్రీన్ చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl