
ఈ క్రమంలోనే ఇక బిసిసిఐ ఇటీవలే ఇండియా ఏ జట్టును ఈ టోర్నీ కోసం ప్రకటించింది. అయితే ఈ జట్టు వివరాలు చూసుకుంటే.. తెలంగాణ యువ కెరటం గొంగిడి త్రిష కూడా టీంలో చోటు సంపాదించుకుంది అని చెప్పాలి. దీంతో తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ లాంటి తెలంగాణ క్రికెటర్ అటు భారత క్రికెట్లో కీలక ప్లేయర్గా ఎదిగాడు. గత కొన్ని సీజన్స్ నుంచి మరో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మంచి ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు అటు మహిళా క్రికెట్ లో కూడా తెలుగు క్రికెటర్లు సత్తా చాటుతూ ఉండడం తో అటు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఇకపోతే ఈ ఆసియా కప్ టోర్నీలో భాగంగా జూన్ 13వ తేదీన హాంకాంగ్ తో.. 15వ తేదీన థాయిలాండ్ తో.. 17వ తేదీన పాకిస్తాన్ జట్లతో ఇక భారత జట్టు తలబడబోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన భారత ఉమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కించుకున్న తెలుగు క్రికెటర్ గొంగిడి త్రిష.. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రదర్శనకు మెచ్చిన సెలెక్టర్లు ఇక ఇప్పుడు ఆసియా కప్ లో కూడా చోటు కల్పించారు అన్నది తెలుస్తుంది. అండర్ 19 వరల్డ్లో రాణించినట్లుగానే ఇప్పుడు ఆసియా కప్ లో కూడా మంచి ప్రదర్శన చేస్తాను అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది గోంగిడి త్రిష.