
ఎందుకంటే గత కొంతకాలం నుంచి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులే సమయం ఉన్నప్పటికీ ఇక ఈ సినిమాకు విపరీతమైన బాస్ ఏర్పడింది అని చెప్పాలి. ఇకపోతే ఈరోజు అంగరంగ వైభవంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఇక భారీ బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమాను ఇక అంతే భారీగా విడుదల చేయబోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఇటీవలే ఒక ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది.
ఇక ఈ ప్రకటన ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేస్తుంది అని చెప్పాలి. ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించినట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. రామాయణం పారాయణం జరిగే ప్రతి చోటికి రామ భక్తుడు హనుమంతుడు విచ్చేస్తాడని మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడు కోసం కేటాయిస్తాం అంటూ ఒక ప్రకటన చేసింది. ప్రతి ఒక్కరం హనుమంతుడితో కలిసి ఆదిపురుష్ సినిమా వీక్షిద్దాం అంటూ చిత్ర బృందం తెలిపింది.