భారత జట్టుకు ఎన్నో ఏళ్లపాటు ఓపెనర్ గా సేవలందించిన శిఖర్ ధావన్ కెరియర్ ముగిసిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే.. అందరూ అవును అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో అతనికి చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ గత కొంతకాలం నుంచి వన్డే ఫార్మాట్లో కూడా అతన్ని పక్కన పెడుతూ వస్తున్నారు సెలెక్టర్లు. ఇక ఆసియా కప్ లో అతను సెలెక్ట్ అవుతాడు అన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు.


అయితే ఈ ఏడాది టీమిండియా రెండు మెగా టోర్నిలు ఆడబోతుంది. పాకిస్తాన్ శ్రీలంకలలో జరగబోయే ఆసియా కప్ తో పాటు ఇండియా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కూడా ఆడబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో ధావన్ కి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఆసియా కప్ కోసం మాత్రం అటు శిఖర్ ధావన్ రంగంలోకి దిగబోతున్నాడట. ఏంటి శిఖర్ ధావన్ ఆసియా కప్ కోసం సెలెక్ట్ అయ్యాడా అని ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే ఆటగాడిగా కాదు కొత్త అవతారంలో ధావన్ సందడి చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది


 భారత ఓపెనర్ ధావన్ ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ ప్రసార బృందంలో నిపుణుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా వెల్లడించింది. ఇక ఎందుకు సంబంధించి ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో దావన్ వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించింది స్టార్ స్పోర్ట్స్. 56 సెకండ్ల నిడివి గల ఈ వీడియోకు ధావన్ కళ్ళలో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని చూడాలని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ల గురించి ధావన్ మాట్లాడటం కూడా ఈ వీడియోలో చూపించారు. అయితే ఈ వీడియోని స్టార్ స్పోర్ట్స్ మళ్ళీ ఎందుకు తొలగించింది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: