ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా పెద్దగా తన బ్యాటింగ్తో ఆకట్టుకోని శుభమన్ గిల్ కు ఛాన్స్ దక్కుతుందా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ గ్రేగ్ చాపెల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వరల్డ్ కప్ లో గిల్ తప్పక రానిస్తాడు అంటూ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్లో గిల్ కు మంచి రికార్డు ఉంది. కాబట్టి మెగా ఈవెంట్లో అతను తప్పక రానిస్తాడని నమ్ముతున్నా. గతంలో తన రికార్డులను పరిశీలిస్తే అతని ఆట తీరు ఏంటో మనకు అందరికీ తెలుస్తుంది.
అయితే గిల్కు కేవలం టెస్ట్ క్రికెట్లో మాత్రమే సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డేల్లో మాత్రం అతడి ప్రదర్శనలు మెరుగ్గానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే బౌలర్లు కొత్త బంతితో బరిలోకి దిగినప్పుడు మాత్రం ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని గ్రేగ్ చాపెల్ సూచించాడు. కాగా గ్రేగ్ చాపెల్ గతంలో టీమ్ ఇండియాకు కోచ్గా కూడా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే ఇకపోతే గిల్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 27 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 1437 పరుగులు చేశాడు ఇందులో ఏకంగా నాలుగు సెంచరీలు ఒక ద్విశతకం ఉన్నాయి అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి