అదే సమయంలో గత కొంతకాలం నుంచి జట్టుకు భారమైన ఆటగాళ్లను కూడా ప్రస్తుతం వదులుకునేందుకు సిద్ధమైంది ఆరెంజ్ ఆర్మీ. ఇక రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను కూడా ఇప్పటికే రెడీ చేసుకుంది అన్నది తెలుస్తుంది. అయితే గత ఏడాది జరిగిన వేలంలో కోట్లు కుమ్మరించి మరి కొనుగోలు చేసిన హరి బ్రూక్ తో పాటు మయాంక్ అగర్వాల్ కూడా ఇక వదులుకునేందుకు టీం సిద్ధమైంది. ఈ ఇద్దరిని వదులుకుంటే అటు సన్రైజర్స్ మనీ పర్స్ కు 21.5 కోట్ల డబ్బు చేరుతుంది. ఇక ఈ మనీతో కత్తిలాంటి యంగ్ క్రికెటర్స్ ని జట్టులోకి తీసుకోవచ్చాలని భావిస్తుండట టీం మేనేజ్మెంట్.
ఈ క్రమంలోనే అటు కొత్త కోచ్ డేనియల్ వెటోరి నేతృత్వంలో మినీ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మతో పాటు శుభమన్ గిల్, పృద్విషాలను కొనుగోలు చేసేందుకు వెటోరి వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ ముగ్గురిలో ఒకరిని తీసుకున్న జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కొత్త కోచ్ భావిస్తున్నాడట. అయితే గిల్ పృద్విషాలు తమ ఫ్రాంచైజీలను వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీంతో వాళ్లను దక్కించుకునే దిశగా సన్రైజర్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది అన్నది తెలుస్తుంది. అయితే తిలక్ వర్మ స్టార్ క్రికెటర్ గా ఎదగడంతో ఇక అతన్ని ముంబై వదులుకునే అవకాశం తక్కువగా ఉంది. దీంతో ఇక ఎక్కువగా అయితే గిల్, పృద్వి షా పైనే కన్నేసిందట సన్ రైజర్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి