
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల పాకిస్తాన్ ప్లేయర్ల ఫీల్డింగ్ పై సెటైర్ వేశాడు. పాకిస్తాన్ - ఫీల్డింగ్.. ఈ జంట ప్రేమ కథ ఎప్పటికీ ముగిసిపోదు అంటూ సెటైర్లు వేయడం గమనార్హం. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం బాబర్ అజం బృందం ఇప్పటికే భారత గడ్డపై అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా సన్నాహక మ్యాచ్లు కూడా ఆడుతుంది. అయితే ఇందులో భాగంగానే న్యూజిలాండ్తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది అని చెప్పాలి అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల మిస్ ఫీల్డ్ కి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇది చూసి పాకిస్తాన్ తీరు ఎప్పటికీ మారదు అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా అనుకుంటున్నారు.
పాకిస్తాన్ ఫీల్డర్లు మహమ్మద్ వాసిన్ జూనియర్, మహమ్మద్ నవాజ్ సమన్వయం లోపంతో ఏకంగా ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చేశారు. ఎంతో సింపుల్ గా బంతిని పట్టుకోవాల్సిన ఆటగాళ్లు సరైన కోఆర్డినేషన్ లేకపోవడంతో చివరికి పరుగులు సమర్పించుకున్నారు. అయితే ఈ వీడియో చూసి ఆ జట్టు అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై ధావన్ స్పందిస్తూ.. పాకిస్తాన్ టీం కి ఇలాంటివి కొత్తేం కాదు. మిస్ ఫీల్డ్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటూ కామెంట్ చేశాడు.