2023 ఐసిసి వన్డే వరల్డ్ కప్ లో ఏ టీం విజేతగా నిలవబోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. ఎంతోమంది మాజీ క్రికెటర్లు ఈ విషయంపై తమ అంచనాను రివ్యూ రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల అక్టోబర్ 5వ తేదీన వన్డే వరల్డ్ కప్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. కాగా లీగ్ దశలో భాగంగా ఐసీసీ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న 10 జట్లు మొత్తంగా 48 మ్యాచులు ఆడబోతున్నాయి అని చెప్పాలి. ఇక ఈ లీగ్ మ్యాచ్లలో టాప్ లో ఉన్న టీమ్స్ 4 సెమి ఫైనల్లో అడుగుపెట్టబోతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ నిపుణులు అందరూ కూడా ఏ జట్లు సెమీఫైనల్కు చేరుతాయి. ఏ టీమ్స్ ఫైనల్ లో అడుగుపెడతాయి అనే విషయంపై రివ్యూ ఇస్తున్నారు.


 ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే కొంతమంది జ్యోతిష్యులు కూడా ఈ వన్డే వరల్డ్ కప్ లో విజేత ఎవరు సెమి ఫైనల్ కు వెళ్లబోయే టీమ్స్ ఏవి అన్న విషయాన్ని కాశీకి చెందిన ఒక జ్యోతిష్యుడు సైతం గ్రహాల కదలికలు నక్షత్ర రాశుల ఆధారంగా వన్డే వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ చేరి నాలుగు జట్ల గురించి జోష్యం చెప్పారు. భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు టాప్ ఫోర్ లో ఉంటాయి అంటూ పండిట్ సంజయ్ ఉపాధ్యయ్ తెలిపారు.  ఈ నాలుగు జట్ల మధ్య సెమీఫైనల్ ఫైట్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.


బృహస్పతి అంగారకుడి మేశంలో.. శని గ్రహం దాని అసలు త్రిభుజం కుంభంలో కూర్చున్నాయని కాబట్టి భారత్ సెమీఫైనల్ గెలవడమే కాకుండా ఫైనల్ కు కూడా వెళ్తుందని సంజయ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఇక 2019లో తొలిసారి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ టైటిల్ గెలిచిందని ఆ సమయంలో బృహస్పతి అంగారకుడి రాశి చక్రంలో ఉన్నాడని చెప్పుకొచ్చారు ఆయన. కుజుడు ఆట యొక్క గ్రహం కాబట్టి బృహస్పతి అంగారకుడి రాశిలో ఉన్నప్పుడల్లా అది విజయాన్ని ఇస్తుందని సంజయ్ చెబుతున్నారు. ఈసారి కూడా ఇంగ్లాండ్ అదే పరిస్థితి ఉండడంతో ఇంగ్లాండు కూడా సెమీఫైనల్కు చేరుకునే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: