ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో భాగంగా అటు ఆస్ట్రేలియా జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లలో ఒకటిగా ఉంది అని చెప్పాలి. వరల్డ్ కప్ కి ముందు బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా.. ఈ వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలవడం ఖాయం అని అభిమానులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆడిన ఆరంభ మ్యాచ్లలోనే అందరి అంచనాలు తారు మారిపోయాయి.



 పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు వరుస ఓటములు చవిచూసింది అని చెప్పాలి. దీంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఆస్ట్రేలియా ఏంటి ఇలాంటి ప్రదర్శిస్తున్న చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది ఆస్ట్రేలియా. వరుసగా మూడు విజయాలు సాధించింది అని చెప్పాలి. దీంతో పాయింట్లు పట్టికలో చివరిలో ఉండగా.. ఇప్పుడు  ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 309 పరుగుల తేడాతో వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒక భారీ విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ మాక్స్వెల్ సూపర్ ఫాస్ట్ సెంచరీ తో ఆకట్టుకోగా.. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ తో మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ కప్ సెంచరీలో జాబితాలో సచిన్ రికార్డును డేవిడ్ వార్నర్ అధిగమించాడు. వీరిద్దరికీ కూడా చెరో ఆరు సెంచరీలు ఉన్నాయి. అయితే సచిన్ 44 ఇన్నింగ్స్ లలో ఆరు సెంచరీలు సాధిస్తే.. వార్నర్ మాత్రం 23 ఇన్నింగ్స్ లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో రెండో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో రోహిత్ శర్మ ఏడు సెంచరీలతో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc