కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీపై ఒక నెగిటివ్ ప్రచారం మాత్రం ఊపందుకుంది. కోహ్లీ గత కొంతకాలం నుంచి సెంచరీల విషయం లో సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నాడని జట్టు ప్రయోజనాలను కాకుండా సొంత రికార్డుల విషయం లోనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో కూడా కోహ్లీ సెంచరీ చేయడానికి ఎంతో నెమ్మదిగా ఆడాడని.. విరాట్ కోహ్లీ ఒక స్వార్ధపరుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు చాలామంది.
కాగా ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రికార్డుల కోసం సెల్ఫిష్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్న వేళ.. అతనికి మద్దతుగా నిలిచాడు. అవును నిజంగానే కోహ్లీ స్వార్ధపరుడు.. ఎంతలా అంటే 100 కోట్ల ప్రజల కలను నెరవేర్చేంత. ఇంత సాధించిన తర్వాత కూడా ఇంకా ఆటలో క్వాలిటీ కోసం ప్రయత్నం చేసేంత స్వార్థపరుడు. కొత్త బెంజ్ మార్కులను క్రియేట్ చేయగల స్వార్థపరుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన టీం ని గెలిపించే అంత స్వార్ధపరుడు అంటూ మాజీ ప్లేయర్ వెంకటేష్ ప్రసాద్ విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి