వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గాయం నుంచి పూర్తిగా కోరుకున్న పంత్ ప్రస్తుతం మళ్ళీ ఫిట్నెస్ సాధించే పనుల్లో కష్టపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల పంత్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. దీంతో త్వరలో రిషబ్ పంత్ మళ్లీ భారత జట్టులోకి రాబోతున్నాడు అంటూ అభిమానులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే రిషబ్ పంత్ ఇప్పట్లో భారత జట్టులోకి వస్తాడో లేదో తెలియదు. కానీ 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం తప్పక ఆడతాడని అందరూ అంచనా వేస్తున్నారు..
అయితే ఇదే విషయం గురించి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్గా కొనసాగుతున్న సౌరబ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ గాయాలనుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ఇప్పుడు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో కచ్చితంగా అతడు ఆడుతాడు. డిసెంబర్ 19వ తేదీన జరగబోయే ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టు నిర్మాణంపై దృష్టి పెడతాం అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే 2024 ఐపీఎల్ నాటికి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి ఐపీఎల్ లో ఆడి మళ్ళీ ఫామ్ నిరూపించుకున్నాడు అంటే వెంటనే భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి