ఈ క్రమంలోనే నేడు జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వరల్డ్ కప్ ప్రస్థానం చూసుకుంటే భారత జట్టు సొంత గడ్డపై వరుస విజయాలు సాధిస్తూ అజేయంగా ఉంది. అటు న్యూజిలాండ్ మాత్రం కాస్త పడుతూ లేస్తూ ప్రయాణం సాగించి అతి కష్టం మీద సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో భారత జట్టు విజయం సాధిస్తుందని అందరూ అంటుంటే.. గత గణాంకాలు మాత్రం న్యూజిలాండ్ దే పైచేయి అని చెప్పక్కనే చెబుతున్నాయి. అయితే న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
అయితే మ్యాచ్ జరుగుతున్న వాంకడే స్టేడియంలో టాస్ ఎంతో కీలక పాత్ర వహించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుండగా.. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వాంకడే స్టేడియంలో నేను చాలా మ్యాచులు ఆడాను. ఇక్కడి పిచ్ పై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. టాస్ అనేది పెద్ద అంశం కాదు. గత నాలుగైదు మ్యాచ్ల ఫలితాలు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న వంకడే స్టేడియం అటు రోహిత్ శర్మకు హోం గ్రౌండ్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇదే గ్రౌండ్ నుంచి అటు రోహిత్ శర్మ క్రికెటర్ గా ఎదిగాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి