వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఇక ఇప్పుడు టి20 సిరీస్ లో ప్రతీకారం తీర్చుకోవాలి అని భావిస్తుంది. అయితే ఇక వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత భారత జట్టులోని సీనియర్ ప్లేయర్లందరికీ కూడా సెలక్టర్లు విశ్రాంతి ప్రకటించారు. దీంతో ఇక జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ చేతికి సారధ్య బాధ్యతలను అప్పగించారు. అంతేకాదు ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కి కూడా జట్టులో చోటు కల్పించారు.


 అయితే అటు ఆస్ట్రేలియా జట్టులో మాత్రం దాదాపుగా వరల్డ్ కప్ లో ఆడిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి  ఇక ఎంతో అనుభవం ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లతో తలబడి యంగ్ టీమ్ ఇండియా ప్లేయర్లు ఎలా రాణిస్తారు అని అందరూ అనుకున్నప్పటికీ ఏకంగా భారీ స్కోరు చేసి విజయం సాధించారు. 209 పరుగుల టార్గెట్ ను చేదించి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే t20 ఫార్మాట్లో ఇప్పటివరకు భారత జట్టు చేదించిన అత్యధిక పరుగుల టార్గెట్స్ ఏంటి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఆ వివరాలు తెలుసుకునేందుకు అటు అభిమానులు అందరూ కూడా తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ వివరాలు చూసుకుంటే.. ఇటీవలే ఆస్ట్రేలియా తో విశాఖ వేదికగా జరిగిన.. టి20 మ్యాచ్ లో భారత జట్టు చేదించిన 209 పరుగుల టార్గెట్ పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియాకు అత్యధిక టార్గెట్గా కొనసాగుతుంది. తర్వాత 2019లో హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 208 టార్గెట్, 2009లో మొహాలీ వేదికగా శ్రీలతతో జరిగిన మ్యాచ్లో 207 పరుగులు, 2020లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 204రన్స్,  2013లో రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 202పరుగులు ఇప్పుడు వరకు టీమిండియా ఛేదించిన అత్యధిక టార్గెట్స్ లిస్ట్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: