భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ వున్నాడు హార్థిక్ పాండ్యా. అయితే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ కావాలని ప్రతి ఒక్క టీం కూడా ఆశ పడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు అయితే స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ లో ఎక్కువగా టీమ్స్ లో కనిపిస్తూ ఉంటారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు జట్టుతో ఉంటే ఒక అదనపు బౌలర్ తో పాటు అదనపు బ్యాట్స్మెన్ కూడా టీంలో ఉన్నట్లు అవుతుంది. అందుకే అటు హార్దిక్ పాండ్యా భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉంటాడు అని చెప్పాలి.

 అయితే ఇక వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా గాయపడిన సమయంలో భారత జట్టు వ్యూహాలు మొత్తం దెబ్బతిన్నాయి. ఏకంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ దూరం కావడంతో అతని స్థానంలో ఇద్దరు ప్లేయర్లను రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ని హార్దిక్ పాండ్యా వదిలి.. మళ్లీ ముంబైలోకి వచ్చేసాడు. అయితే ఇక కెప్టెన్గా పాండ్య స్థానంలో గిల్ ను నియమించారు. కానీ ఇక అతని లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ జట్టుకు అవసరం. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు గుజరాత్ యాజమాన్యం ఏం చేయబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 ఈ క్రమంలోనే హార్దిక్ ముంబై ఇండియన్స్ లోకి వెళ్ళిన నేపథ్యంలో  అతని స్థానాన్ని భర్తీ చేయడంపై గుజరాత్ టైటాన్స్ దృష్టి సారించింది అన్నది తెలుస్తుంది. అయితే శార్దూల్ ఠాగూర్, షారుఖ్ ఖాన్, మనీష్ పాండే, ఓమర్ జాయి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19వ తేదీన జరగబోయే మినీ వేలంలో వీరిని దక్కించుకునేందుకు గుజరాత్ పోటీపడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ యువ సంచలనం ఉమర్ జాయ్ అదరగొట్టేసాడు. అయితే షారుక్ ఖాన్ సైతం మంచి ఫినిషింగ్ ఇచ్చాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: