
ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో అటు భారత జట్టు ఓటమిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. భారత జట్టు కప్పు గెలవడం ఖాయమని 100% నమ్మకం పెట్టుకున్న వారు నిరాశలో మునిగిపోయారు. అయితే ఇలా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన సమయంలో భారత జట్టు సీనియర్ ప్లేయర్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను మరింత బాధించింది అని చెప్పాలి. 2019లోనే ఈ ఇద్దరు క్రికెటర్లకు కన్నీళ్లు మిగిలాయి అనుకుంటే ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిందని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు.
అయితే 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన సమయం లో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉంది అన్న విషయాన్ని టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఫైనల్ మ్యాచ్లో ఓటమి తర్వాత రోహిత్ కోహ్లీలు ప్రెస్సింగ్ రూమ్ లో ఏడ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఫైనల్ ఓడిన తర్వాత ఎంతగానో బాధపడ్డాం. రోహిత్, కోహ్లీని అలా చూస్తుంటే ఎంతో బాధేసింది. రోహిత్ అద్భుతమైన కెప్టెన్. టీం లోని ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకుంటారు. నిద్ర మానుకొని మరి టీం మీటింగ్లకు హాజరవుతూ ఉంటాడు. అంతేకాదు ఎంతో ఎఫెక్ట్ పెడుతూ ఉంటాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.