
ఒకప్పుడు ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ ఎంతలా అయితే సక్సెస్ అయ్యాడో.. ఇక ఇప్పుడు కోచ్గా కూడా అదే రీతిలో సక్సెస్ సాధించాడు అని చెప్పాలి. ఇక అతని కోచింగ్ లోనే ప్రస్తుతం టీమిండియా మూడు ఫార్మాట్ లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇక ఇప్పుడు మరోసారి రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అంటూ ఇటీవల బిసిసిఐ అధికారిక ప్రకటన చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాగా ఇదే విషయం గురించి అటు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న కోచింగ్ స్టాఫ్ నే మళ్లీ కొనసాగించాలి అని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అంటూ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఈ ప్రతిపాదనకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ ఒప్పుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం అంటూ చెప్పుకొచ్చాడు. టి20 ఫార్మాట్ అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది అయితే ఈ ఫార్మాట్లోనూ అటు కోచింగ్ సిబ్బంది అద్భుత ఫలితాలను సాధిస్తారు అని అనుకుంటున్నాను అంటూ గౌతమ్ గంభీర్ తెలిపాడు.