
ఏకంగా ఒకరిపై ఒకరు మైదానంలోనే పిడుగుద్దులు కురిపించుకుంటారేమో అన్న రీతిలో కోపంలో ఇద్దరు ఆటగాళ్లు ఒకరి మీదకి ఒకరు దూసుకుపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి గొడవ ఏదైనా జరిగింది అంటే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గత ఐపీఎల్ సీజన్ సమయంలో కూడా విరాట్ కోహ్లీకి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే నవీన్ ఉల్ హక్ కీ ఇలాగే గొడవ జరిగింది. ఇక ఈ గొడవ ఐపిఎల్ టోర్నీ జరిగినన్ని రోజులు మాత్రమే కాదు ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఇలా ఐపీఎల్ సమయంలో, ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ఏకంగా గొడవకు మరింత ఆజ్యం పోసే విధంగానే నవీన్ ఉల్ హక్ కొన్ని పోస్టులు పెట్టాడు. విరాట్ కోహ్లీ ఔట్ అయిన ప్రతిసారి కూడా మామిడి పండ్ల ఫోటోని పోస్ట్ చేస్తూ అతనిపై విమర్శలు చేశారు. కోహ్లీ తో గొడవ ఉన్న నేపథ్యంలో అతన్ని టార్గెట్ చేస్తునే ఇలాంటి పోస్ట్ పెట్టాడు అంటూ విమర్శలు రాగా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు నవీన్. మ్యాచ్ చూస్తున్నప్పుడు మ్యాంగోస్ తింటున్నాను కాబట్టి అలాంటి పోస్ట్ పెట్టాను తప్ప అది ఎవరిని ఉద్దేశించి కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీతో ప్రస్తుతం తనకు ఎలాంటి గొడవ లేదు అంటూ చెప్పుకొచ్చాడు.