ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించడం పైన చర్చ జరుగుతూ ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతలు నుంచి తప్పించడం ఏంటి అని భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇప్పటికీ షాక్ లోనే మునిగిపోయారు అని చెప్పాలి. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి హార్దిక్ పాండ్యాను టీంలోకి తీసుకొని మరి అటు ముంబై యాజమాన్యం అతని చేతిలో కెప్టెన్సీ పెట్టడాన్ని అసలు జీవించుకోలేకపోతున్నారు రోహిత్ అభిమానులు.


 ఐపీఎల్ లో ఉన్న మిగతా టీమ్స్ యాజమాన్యాలు రోహిత్ లాంటి కెప్టెన్ కావాలి అనుకుంటుంటే.. ఇక ముంబై మాత్రం ఇక సక్సెస్ఫుల్ కెప్టెన్ ని పక్కన పెట్టడం ఏంటి అని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. అయితే రోహిత్ శర్మను కెప్టెన్ గా మార్చి హార్థిక్ పాండ్యాను సారథిగా నియమించడంలో తప్పేముంది అంటూ ఇప్పటికే మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.


 ఇక ఇటీవల ఇదే విషయం గురించి టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించడం పై ఎమోషనల్ గా ఆలోచించకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. పాండ్యాను కెప్టెన్గా నియమించడం మంచి నిర్ణయమే అంటూ సమర్ధించాడు సంజయ్ మంజ్రేకర్. రోహిత్ చాలా కాలం నుంచి సారధిగా ఉండడంతో.. అభిమానులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని.. అందుకే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో నిరాశ చెందారు  అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయంతో జట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నట్లు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: