సాధారణంగా టెస్ట్ ఫార్మాట్ ని సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ మొదలైంది టెస్ట్ ఫార్మాట్ తోనే. ఇప్పుడంటే ఇక క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ని మరింత పెంచుకునేందుకు వన్ డే ఫార్మాట్ తో పాటు టి20 ఫార్మాట్ లు అందుబాటులోకి వచ్చాయి. కానీ క్రికెట్ పుట్టింది మాత్రం టెస్ట్ ఫార్మాట్లోనే అందుకే సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్టు ఫార్మాట్ లో ఎక్కువ కాలం పాటు కెరియర్ను కొనసాగించాలని ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఆశపడుతూ ఉంటారు.


 అయితే టెస్ట్ ఫార్మాట్లో రాణించడం అనేది అంత సులభమైన విషయం కాదు. క్రీజులోకి వచ్చి సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవడం కాదు.. ఇక ఎంతో ఓపికగా ఆడుతూ పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. అందుకే మహా మహా ప్లేయర్లు సైతం టెస్టు ఫార్మాట్లో తడబడుతూ చెత్త రికార్డులు మూటగట్టుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఇక అగ్రశ్రేణి టీమ్స్ సైతం టెస్టు ఫార్మాట్లో ఇక మంచి ప్రదర్శన చేయలేక విమర్శల పాలు అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక పసికూన జట్టు మాత్రం టెస్ట్ ఫార్మాట్లో తొలి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.


 ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన పసీకూన ఐర్లాండ్ ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన బెస్ట్ మ్యాచ్ లో మాత్రం మొదటి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ లోని అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఐరిష్ జట్టు విజయ డంక మోగించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫస్ట్, సెకండ్ ఇన్నింగ్స్ లో 155, 218 పరుగులు చేసింది. ఇక ఐర్లాండ్ జట్టు ఇక రెండు ఇన్నింగ్స్ లో 263, 111 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఏకైక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ను ఐర్లాండ్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: