మొదటి మ్యాచ్ లో అటు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే అంతకుముందే అటు ఐపీఎల్ ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఎంతోమంది సెలబ్రిటీలు ప్రదర్శన కూడా ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈసారి ఐపీఎల్ లో కొన్ని జట్లు ఏకంగా కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగబోతున్నాయి. ఆ వివరాలు చూసుకుంటే..
ముంబై ఇండియన్స్ : ఐపీఎల్ లో ఛాంపియన్ టీం గా ఉన్న ముంబై ఇండియన్స్ కి కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు హార్దిక్ పాండ్యా. అయితే అతను రోహిత్ ను మరిపిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
చెన్నై సూపర్ కింగ్స్ : ఐపీఎల్ మోస్ట్ టైటిల్స్ విన్నింగ్ టీమ్ గా కొనసాగుతున్న చెన్నై జట్టుకి ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని కొత్త సారధిగా రుతురాజ్ ను నియమించారు. అతను ఎలా రాణిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
గుజరాత్ టైటాన్స్ : హార్దిక్ పాండ్యా గుజరాత్ ను వదిలి అటు ముంబైకి వెళ్లిపోవడంతో.. గుజరాత్ కొత్త కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన పని ఏర్పడింది. దీంతో యువ ఆటగాడు గిల్ చేతిలో కెప్టెన్సీ పెట్టింది. అతను కెప్టెన్సీ ప్రతిభను చూసేందుకు అందరూ ఎదురు చూస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ : కప్పు కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షణ ఎదురుచూస్తున్న సన్రైజర్స్ ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను తమ కెప్టెన్ గా నియమించుకుంది. ఇక అతను టైటిల్ అందిస్తాడో లేదో చూడాలి.