ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ టోర్ని జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరగబోయే ఈ ప్రపంచకప్ టోర్ని చూసేందుకు అందరూ సిద్ధమైపోతున్నారు. అయితే మొత్తంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో 20 టీమ్స్ పాల్గొనబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజేయతగా నిలవడమే లక్ష్యంగా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయ్ ఆయా టీమ్స్.


 అయితే మరికొన్ని రోజుల్లో అటు వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించాలి అంటూ అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు డెడ్ లైన్ విధించింది. అదే సమయంలో ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ కప్ కి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహించడంలో బిజీ బిజీ అవుతుంది అని చెప్పాలి. పలువురు బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకొని ఇక వారితో ప్రమోషన్స్ చేయించడానికి సిద్ధమైంది. ఇప్పటికే హుస్సేన్ బోల్డ్ వరల్డ్ కప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు టీమిండియా మాజీ ఆటగాడికి కూడా ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది అన్నది తెలుస్తోంది. 2024 t20 వరల్డ్ కప్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఎంపిక అయ్యాడు. ఇక ఈ మేరకు ఐసిసి ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమాలలో యువీ పాల్గొనబోతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే జూన్ రెండవ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా.. జూన్ 5వ తేదీన టీమిండియా జట్టు మొదటి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడబోతుంది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేతగా అవతరించాలని పట్టుదలతో ఉంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: