ప్రముఖ ఛానల్ ఈటీవీ లో ప్రసారమవుతూ అతి తక్కువ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీరియల్ యమలీల. ఈ సీరియల్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా నటిస్తూ.. ఆడియన్స్ ని బాగా ఆదరిస్తున్నారు అనడంలో నిస్సందేహమే లేదు. ఇకపోతే ఈ సీరియల్ లో చిన్ని కి అన్నగా నెగిటివ్ రోల్ పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న శ్రీను.. నటుడు మాత్రమే కాదు ప్రొడ్యూసర్ గా కూడా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ రోజు శ్రీను రియల్ లైఫ్ గురించి ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

శ్రీను అసలు పేరు సురేష్.. బుల్లితెర మీద యమలీల సీరియల్ లో నటించక ముందే మరో రెండు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. అభిషేకం సీరియల్ లో అర్జున్ గా నటించిన శ్రీను , ఆ తర్వాత వచ్చిన స్వాతి చినుకులు సీరియల్ లో అక్షయ్ గా నటించాడు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోని సినిమాలో అయినా సరే బుల్లితెరపై ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ లో అయినా సరే ఎవరైనా నెగటివ్ రోల్ పోషిస్తున్నారు అంటే వారు నిజ జీవితంలో చాలా మంచి మనసున్న వ్యక్తి అని చెబుతూ ఉంటారు..

శ్రీను కూడా ఆ కోవకు చెందిన వాడే.. నిజానికి విలనిజాన్ని చాలా చక్కగా పండించినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఎంతో మందిని ఆదుకుంటూ అందరితో చక్కగా కలిసిపోతూ ఎంతో మంది స్నేహితులను కూడా పొందాడు. జీ తెలుగు లో ప్రసారమైన రామ సక్కని సీత సీరియల్ లో కూడా శ్రీను నటించాడు. ప్రస్తుత యమలీల సీరియల్ లో ప్రముఖ సీనియర్ కమెడియన్ ఆలీతో పాటు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటీమణి భావన తో కలిసి నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు మొదటిసారి యమలీల సీరియల్ కు ప్రొడ్యూసర్ గా కూడా పని చేస్తున్నాడు శ్రీను.

మరింత సమాచారం తెలుసుకోండి: