
ఎందుకంటే తెలుగింటి కోడలుగా వచ్చిన ఈమె ఎవరు అందుకోలేని బెంచ్ మార్క్ సెట్ చేసి ప్రతి ఛానల్ లో దాదాపు అన్ని షోలు చేసింది. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్ల కంటే ఈమెకి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అయితే తాజాగా కొన్నేళ్ల ముందు వరకు సుమని వేలు ఎత్తి చూపడానికి ఒక కారణం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కాస్త మారిపోతుంది అన్న సందేహం కూడా కలుగుతుంది.. తెలుగు విషయంలోకి వెళ్తే ఇటీవల కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ ను ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ చెబుతూ తారక్ కు మైకు అందజేసింది. అయితే ఆ సమయంలో సుమా వైపు చూస్తూ ఎన్టీఆర్ కూడా కోపం తెచ్చుకున్నాడు.
సుమ యాంకరింగ్ విషయంలో ఇలా జరగడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు. కానీ కొన్నాళ్ళ ముందు కూడా రాజమౌళి పాల్గొన్న ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోను ఎస్ ఎస్ ఎం బి 29 గురించి అంటూ కూడా ఆమె ఇన్వాల్వ్ అయింది.. ఇలా ప్రతి ఈవెంట్లలో కూడా వేరొకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని సుమా యాంకరింగ్ ఇప్పుడు శృతి తప్పుతోందని పలువురు నెటిజన్లు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి సుమా తన ధోరణిని మార్చుకుంటుందో లేదో చూడాలి.