ఎక్కడో పాశ్చాత్య దేశమైనా బ్రిటన్ లో బిగ్ బ్రదర్ పేరుతో మొదలైన రియాల్టీ షో ఇండియాలో బిగ్ బాస్ గా ప్రాచుర్యం పొంది అన్ని ప్రాంతీయ భాషలలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలను నాలుగు గోడల మధ్య ఉంచి వారి లైఫ్ స్టైల్, ఆలోచనలు, పోరాట పటిమను దగ్గరగా చూపించే ఏకైక షో ఇది. అందుకే ఊహకు మించిన ఆదరణను సొంతం చేసుకుంది. 2017లో తెలుగులో మొదటిసారి బిగ్ బాస్ షో ని మొదలుపెట్టినప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించారు.

ఇక టాప్ సెలబ్రిటీలు ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొనడంతో సీజన్ కాస్త మంచి క్లిక్ అయింది.  ఆ తర్వాత ఎన్టీఆర్ తప్పుకోవడంతో నాని రంగంలోకి దిగారు. ఆయన పరవాలేదు అనిపించుకున్నాడు కానీ తనపై వచ్చిన విమర్శలకు హార్ట్ అయిన నాని మనకెందుకు ఈ తలనొప్పి అనుకొని సీజన్ 3 చేయనని అన్నాడు. దాంతో రంగంలోకి దిగాడు కింగ్ నాగార్జున. అప్పటికే జెమినీ చానల్లో మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు.  పైగా హోస్టింగ్ లో అనుభవం కూడా ఉంది.  అందుకే ఆయనే బెస్ట్ ఛాయిస్ అని ఆలోచించిన మేకర్స్.. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ మూడవ సీజన్లో సక్సెస్ఫుల్గా కొనసాగించారు.

అయితే ఆరవ సీజన్ విషయంలో నాగార్జున ఫెయిల్ అయ్యాడు.  దాంతో ఆయన కూడా ఈసారి తప్పుకోవాలని అనుకున్నాడు. మరి ఏమైందో తెలియదు కానీ సీజన్ సెవెన్ కి కూడా ఆయనే హోస్ట్ గా చేస్తున్నాడు అంటూ తాజాగా ప్రోమోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే సీజన్ సిక్స్ ఫెయిల్ అవ్వడంతో సోషల్ మీడియాలో నాగార్జున పై ఎన్నో విమర్శలు వచ్చాయి.  అయినా కూడా ఆయనే కొనసాగడానికి బలమైన కారణం కూడా ఉందట. అయితే ఇక్కడ నాగార్జున ఓన్లీ ఆప్షన్ అవ్వడానికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్,  రానా,  బాలకృష్ణ వంటి హీరోలు ఉన్నా సరే వారు రావడానికి ఎందుకో ఆసక్తి చూపించడం లేదు.మిగతా హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు.  ఇక నానికి అనుభవం ఉంది కానీ విమర్శలకు భయపడుతున్నారు. ఇక విశ్వక్సేన్ విజయ్ దేవరకొండ వంటి వారు ఉన్నా  సెట్ అవుతారు కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు. అందుకే నాగార్జున పై వ్యతిరేకత ఉన్నా సరే వేరే మార్గం లేక నాగార్జునను తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: