ప్రస్తుత కాలంలో బుల్లితెరపై ఎన్నో షోలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించి ఇప్పుడు షోల ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ పంచడానికి సీరియల్స్ సెలబ్రిటీలు షోలలో పాల్గొంటూ వాటి టిఆర్పి రేటింగ్ అమాంతం పెంచేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ షో ల నుంచి విడుదల చేసే ప్రోమోలు ఎపిసోడ్ లపై మంచి ఇంట్రెస్ట్ ను కలిగిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి.

ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ తో పాటు బుల్లితెర సీరియల్స్,  నటీనటులు కూడా హాజరయ్యి సందడి చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే వచ్చే ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేయగా అందులో జబర్దస్త్ అలాగే బుల్లితెర సీరియల్స్ నటులు పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలను కూడా ఈ కార్యక్రమంలో ఘనంగా సెలబ్రేట్ చేసారు.

ఇకపోతే ఆది ఈ కార్యక్రమంలో భాగంగా తన గర్ల్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేయడం మనం చూడవచ్చు. షో మొత్తం సందడిగా సాగుతున్న సమయంలో బుల్లితెర నటులు మానస్ , అర్జున్ ఇద్దరూ కూడా తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఏకంగా వేదికపై ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవకు కారణం.. బ్రో సినిమాలోని పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ వేదికపైకి మానస్ రాగా ఆయన నటనకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు.  అర్జున్ వేదిక పైకి రావడం మానస్ గొడవపడడం జరిగింది.. మానస్ పై అర్జున్ వేసే పంచ్ డైలాగ్లను తట్టుకోలేకపోయిన మానస్ .. అర్జున్ తో గొడవకు దిగారు . ఇలా ఇద్దరు ఒకరికొకరు వేదికపై కొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీంతో ప్రోమో కట్ చేయడం జరిగింది. ఇక నిజంగానే వీరిద్దరు గొడవపడ్డారా లేక ప్రోమో కోసం ఇలా చేశారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: