ఏళ్ల తరబడి ఒకే పని చేయడంతో బోర్ కొట్టిందో ఏమో కానీ ఇప్పుడు షోలు తగ్గించిన ఈమె కేవలం రెండు షోలు మాత్రమే చేస్తోంది. అందులో సుమా అడ్డ , అమ్మ ఆవకాయ వంటి రెండు షోలకు మాత్రమే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ తాజాగా తన గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ.. తనలోని తెలియని కోణాన్ని బయటకు పరిచయం చేసింది. తాజాగా లేటెస్ట్ డిజైనర్ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ గా మొదటిసారి కనిపించి అందరిని ఆకట్టుకుంది . ప్రస్తుతం సుమా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా సుమా ధరించిన ఈ ట్రెండీ వేర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. సుమ కెరియర్ విషయానికి వస్తే.. 1996లో నటిగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి దాసరి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది . ఆ తర్వాత రెండు మూడు మలయాళం సినిమాలలో హీరోయిన్గా నటించినా.. పెద్దగా కలిసి రాలేదు. దీంతో యాంకర్ గా అవతారం ఎత్తి తిరుగులేని ఆధిపత్యాన్ని అందుకుంది. ఇక సుమ తన వాక్చాతుర్యంతో అందరిని అలరిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే సుమా కూడా యంగ్ యాంకర్ల బాటలో ఇలా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి