ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ 6 సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్లో కూడా నాలుగు వారాలను ఈ రోజుతో పూర్తిచేసుకోబోతోంది.ఇక రేపటి నుంచి ఐదవ వారం మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలుగులో ఈ షో రన్ అవుతూ ఉండగా తమిళంలో ఈరోజే మొదలు కాబోతోంది. అక్కడ కూడా ఏడవ సీజన్ గ్రాండ్ గా లాంచ్ కానున్న నేపథ్యంలో ఈసారి హౌస్ లోకి దాదాపు 20 మంది కంటెస్టెంట్ ల వరకు అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక అందులో హీరోయిన్ శ్రీదేవి కూడా ఉందని సమాచారం.

యంగ్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తల్లి మంజుల, తండ్రి విజయ్ కుమారుల నటవారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ను మొదలు పెట్టింది.  ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి.. తెలుగులో ఆదిలక్ష్మి, నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసిన ఈమె తెలుగులో చివరిగా 2011లో వచ్చిన సెల్ఫోన్ మూవీలో నటించి మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఇక కన్నడ లో 2016లో లక్ష్మీ సినిమాలో నటించి చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పిన ఈమె బుల్లితెరపై పలు షో లకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

అప్పుడప్పుడు తెలుగు బుల్లితెర షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్న శ్రీదేవి తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొనబోతోంది అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.  ఇకపోతే తమిళ బిగ్ బాస్ 3 సీజన్ లో ఈమె సోదరీ వనిత విజయ్ కుమార్ పాల్గొనగా.. రెండోవారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. అప్పటినుంచి టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గుతూ వచ్చింది. ఇక ఆమె లేని లోటు బిగ్ బాస్ కి తెలిసి వచ్చిందో ఏమో తెలియదు కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆమెను మళ్ళి లోపలికి పంపించారు. అయినప్పటికీ టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకోలేకపోయింది వనిత విజయ్ కుమార్. మరి చెల్లెలు శ్రీదేవి ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: