ఈ మధ్యకాలంలో బుల్లితెరపై నుంచి అతి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కమెడియన్స్ లలో హైపర్ ఆది కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు.ఈ మధ్యకాలంలో వెండితెర పైన ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ తన కామెడీ స్కిట్లతో మాత్రం ఇటీవల కాలంలో తక్కువగా ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా వదిలేశారు..కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఢీ వంటి షోలలో మాత్రమే చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు పలు రకాల కార్యక్రమాలలో కూడా కనిపిస్తూ ఉంటారు హైపర్ ఆది.


పొలిటికల్ పరంగా కూడా యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా జబర్దస్త్ షోలో శాంతి స్వరూప్ హైపర్ ఆది కి సంబంధించి ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ జబర్దస్త్ లో కొన్ని రకాల స్కిట్లను కూడా చేస్తున్నారు.. ముఖ్యంగా శాంతి స్వరూప్ పురుషుడైనప్పటికీ లేడీ గెటప్పుల లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు. అలా పలు చిత్రాలలో అవకాశాలను అందుకున్నారు.. హైపర్ ఆది విషయానికి వస్తే తన కామెడీ టైమింగ్ తో అదిరిపోయే పంచులేస్తే ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.


అసలు విషయంలోకి వెళ్తే హైపర్ ఆది రాముడిగా ఉండగా సీతగా శాంతి స్వరూప్ కనిపిస్తూ..Ai ద్వారా ఎడిట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ ఫోటోల పైన పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ దారుణాన్ని మేము చూడలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోల పైన  హైపర్ ఆది అభిమానులు  మాత్రం సైతం ఏకీపారేస్తున్నారు. కావాలని ఇలాంటివి సృష్టిస్తూ హైపర్ ఆదిని చీప్ చేసే విధంగా చేస్తున్నారంటూ అభిమానులు సైతం వాపోతున్నారు. మరి ఇలాంటి ఫోటోలు పైన హైపర్ ఆది ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: