జబర్దస్త్ కామెడీ షోకి ఎంతోమంది జడ్జిలుగా మారినప్పటికీ నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించినప్పుడే చాలామంది బాగా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. ఇటీవలే జబర్దస్త్ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకించి ఒక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పాత టీమ్ లీడర్లను తీసుకురావడం జరిగింది. అయితే వీరిలో సుడిగాలి సుదీర్, రోజా వంటి వారు రాకపోయినప్పటికీ స్కిట్లను చాలా ఎమోషన్స్ తో బాగానే ఆకట్టుకునేలా చేశారు. ఈవెంట్ ని నాలుగు ఎపిసోడ్లుగా రెండు వారాలపాటు ప్రసారం చేయడం జరిగింది.



అలా జబర్దస్త్ షో చూసిన వారందరూ కూడా ఇక పూర్వ వైభవం వచ్చేసింది అనుకున్న సమయంలోనే.. ఆడియన్స్ అందరికీ షాక్ ఇస్తూ మళ్లీ పాత రోతని తీసుకువచ్చింది.. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అంత మామూలుగానే కనిపిస్తూ ఉన్నది. జడ్జిలుగా ఖుష్బూ, కృష్ణ భగవాన్ వచ్చారు. మొన్నటివరకు ఉన్న వాళ్ళే టీమ్ లీడర్స్  మళ్ళీ కనిపించసాగారు. అలాగే డబుల్ మీనింగ్ ,కామెడీ డైలాగులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే యాంకర్ గా రష్మి , మానస్ కనిపించారు.. ఇందులో ధనరాజ్ మళ్లీ టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చి స్కిట్తో బాగానే ఆకట్టుకున్నారు.


ప్రోమో చివరిలో నూకరాజు చేసిన స్కిట్ మొత్తం కూడా చాలా ఇబ్బంది కలిగించేలా మారింది. ఈ స్కిట్ లో కమెడియన్ కొమరం పక్కనే ఉన్న మరొక కమెడియన్ ని చేయి చేసుకోవడంతో స్కిట్టులో భాగంగా ఇది చేసినప్పటికీ రియల్ గా కొట్టారు. దీంతో ఆ కమెడియన్ కొమరంతో గొడవ పడడం జరిగింది. ఇలా స్కిట్లు ఇద్దరు గొడవపడడం చూసిన జడ్జి ఖుష్బూ ఒక సంచలనం నిర్ణయం తీసుకుంటూ ఇక మీదట టీమ్స్ అందరికీ చెబుతున్నాను ఎవరైనా ఇలా కొడితే మాత్రం మార్క్స్ అన్ని కూడా మైనస్ కి వేసేస్తానని తెలిపింది. కామెడీ అంటే కొట్టుకోవడం కాదని కేవలం కొట్టినట్టుగా యాక్టింగ్ చేయాలి.. మీరు నిజంగానే కొట్టుకుంటున్నారు ఇకమీదట ఎవరూ కూడా హద్దులు దాటి వెళ్ళకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఖుష్బూ.

మరింత సమాచారం తెలుసుకోండి: