మొబైల్ అంటే ఇష్టపడని వాళ్ళు ఈరోజుల్లో ఎవరు ఉండరు.. అది నిజమే అనుకోండి.. ప్రపంచాన్ని మొత్తాన్ని అరచేతిలో చూడొచ్చు అందుకే ఫోన్లకు డిమాండ్ భారీగా పెరిగింది.అయితే ప్రజలు మెచ్చేలా ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీ ఉన్న ఫోన్లను..తక్కువ ధరలతో తీసుకొస్తున్నారు. మొబైల్ కంపెనీల వ్యవహారం మాములుగా లేదని చెప్పాలి.. పోటీ పడి కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి వదులుతున్నారు. ఇటీవల కాలంలో చాలా ఫోన్లు వచ్చాయి.. ఇప్పటికీ వస్తున్నారు.



ప్రస్తుతం ఒప్పో కంపెనీ కాస్త ముందుంది.. మరో కొత్త ఫీచర్స్ తో పాటుగా అతి తక్కువ ధరతో మార్కెట్ లోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ ఫోన్ లో అంత ప్రత్యేకత ఉంది.. ఎలా దానిని వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..ఒప్పో ఏ33 ఫోన్ మొదటగా ఇండోనేషియా లో లాంఛ్ చేశారు. ఇప్పుడు భారత్ లో లాంఛ్  చేయనున్నారు.5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. అంతేకాదు వెనుక మూడు కెమెరాలను కూడా అందించారు.



 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ఫోన్ లాంచ్ చేశారు. అయితే కొన్ని బ్యాంక్ ల ద్వారా ఈ ఫోన్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు కూడా ఉందట..అలాగే ఈ మొబైల్ ప్రైజ్ కూడా తెలిసిపోయింది.రూ.11,990గా కంపెనీ నిర్ణయించారు.ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, వైఫై కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయట.. తక్కువ ధరలో చాలా ఫీచర్లు ఉండటంతో యువత ఫోన్ కోసం ప్రీ బుకింగ్ కొరకు తెగ ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: