మొబైల్ ఫోన్లు కళ్లు తెరిచే లోపు కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి.. రోజుకో కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో పాటుగా , సరసమైన ధరలకే ఫోన్లను లాంఛ్ చేస్తుంది..ప్రపంచంలోనే టాప్ మొబైల్ ఫోన్లు వాటికి అంత పాపులారిటీ రావడానికి కారణాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా ఓ ప్రముఖ రీసెర్చ్ సంస్థ కానలిస్ తాజాగా 2020 మూడో త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం ఈ త్రైమాసికంలో 34.8 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. గతేడాది మూడో త్రైమాసికంతో ఇది ఒక్క శాతం తక్కువ. శాంసంగ్ తిరిగి 2 శాతం లీడ్‌తో మొదటి స్థానంలోకి వచ్చింది.



ఇకపోతే రెండో స్థానంలో హువావే ఉందట..షియోమీ 4.71 కోట్ల స్మార్ట్ ఫోన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక సెప్టెంబర్‌లో ఏ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయకపోయినా యాపిల్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. యాపిల్ స్మార్ట్ ఫోన్లు ఈ త్రైమాసికంలో 4.32 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి.. ఇకపోతే ఐదో స్థానంలో వివో ఫోన్లు ఉన్నాయట..ప్రపంచ వ్యాప్తంగా భారీ గా అమ్ముడు పోయిన టాప్ టెన్ ఫోన్లు విషయానికొస్తే.. 


శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్

శాంసంగ్ గెలాక్సీ ఏ11

శాంసంగ్ గెలాక్సీ ఏ51


 రెడ్ మీ 9

 శాంసంగ్ గెలాక్సీ ఏ31

 రెడ్ మీ 9ఏ


 శాంసంగ్ గెలాక్సీ ఏ01 కోర్


యాపిల్ ఐఫోన్ 11

 యాపిల్ ఐఫోన్ ఎస్ఈ

ప్రపంచ వ్యాప్తంగా భారీగా అమ్ముడు పోయిన ఫోన్లలో ఐదు శాంసంగ్ ఫోన్లు ఉండగా..రెండు యాపిల్ ఫోన్లు,మూడు షియోమీ ఫోన్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే చైనా స్మార్ట్ ఫోన్ల షిప్ మెంట్లు బాగా పడిపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కేవలం షియోమీ మినహా మిగతా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లన్నీ పతనాన్ని చవిచూశాయి. హువావే 18 శాతం, వివో 13 శాతం, ఒప్పో 18 శాతం మేర పడిపోయాయి. ఐఫోన్ కూడా గతం తో పోలిస్తే ఈ ఏడాది నష్టాల్లో నే నడిచిం దని నిపుణులు అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: