వన్ ప్లస్ కంపెనీ యాపిల్ ఫోన్లతో సమానంగా ఉంటుంది. ఈ ఫోన్లకు డిమాండ్ మార్కెట్ లో రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. యాపిల్ తో పోలిస్తే ఈ ఫోన్ అన్నీ విధాల బెటర్ గా ఉండటంతో యువత ఎక్కువగా ఈ ఫోన్లను కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ ఎన్నో ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. తాజాగా మరో అద్భుతమైన ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. అయితే ఈ ఫోన్ విడుదల అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఆన్ లైన్ లో మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. 


ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన ఫోటోలు బయటకి విడుదలయ్యాయి. వనిల్లా వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన చిత్రాలను యూట్యూబర్ డేవ్2డి లీక్ చేసాడు. లీకైన ఫోటోలను బట్టి చూస్తే మనకు వన్‌ప్లస్ 9ప్రో వెనుక కెమెరాలో రెండు ప్రధాన కెమెరాలతో పాటు, మరో రెండు ఇతర చిన్న కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో టెలిఫోటో కెమెరాగా కనిపిస్తుంది.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మొబైల్ ప్రియులకు ఈ వార్త సంతోషాన్ని కలిగించింది. ఇకపోతే ఈ కంపెనీ గతంలో తీసుకొచ్చిన ఫోన్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్ లో వాటి డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. 


వన్‌ప్లస్ ఈ సారి ప్రధానంగా కెమెరా మీద దృష్ట్టి పెట్టినట్లు కనిపిస్తుంది.వన్‌ప్లస్ ఈ సారి ప్రధానంగా కెమెరా మీద దృష్ట్టి పెట్టినట్లు కనిపిస్తుంది. వినియోగదారులు వన్‌ప్లస్ ప్రధానంగా కెమెరా విషయంలో ఇతర మొబైల్ ఫోన్ తో పోలిస్తే వెనుకబడినట్లు పేర్కొంటున్నారు. వన్‌ప్లస్ 9ప్రో డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ నాచ్ కటౌట్ కలిగి ఉంది. ఆసక్తికరం విషయం ఏంటంటే దీనిలో ఏ ప్రాసెసర్ తీసుకొస్తున్నారో బయటకి వెల్లడించలేదు. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తున్నట్లు సమాచారం. దీనిని ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో తీసుకొనిరానున్నారు. మరి ఆ ఫోన్ ఎలా డిమాండ్ ను అందు కుంటుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: