ప్రస్తుతం మనం ఎక్కువగా వాడుతున్న వాటిలో స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ కూడా ఒకటి. ఇవి రెండూ ప్రస్తుతం మన జీవితం లో ఒక భాగమయ్యాయి. మనం ఎక్కడికైనా  బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదా  ఇంట్లో వీటికి ఛార్జింగ్ చేయాలనుకున్నప్పుడు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లకు ఛార్జర్ లేకుంటే ఇక అంతే.. మన దగ్గర్లో ఉన్న ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితిని మనలో చాలా మంది ఎదుర్కొన్నవాళ్ళమే.


అయితే ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టే విధంగా షావోమి అయినటువంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ సంస్థ , ఒక కొత్త ఛార్జర్ ను రిలీజ్ చేసింది. దీంతో ఇలాంటి సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టవచ్చట. ఈ ఛార్జర్ ని మార్కెట్లోకి 67 W Sonic ఛార్జ్ 3.0  పేరిట నిన్న అనగా సోమవారం జూన్ 12వ తేదీన  విడుదల చేసింది. ఈ ఛార్జర్ టైప్-A నుంచి USB,type-c ను కూడా సపోర్ట్ చేయగలుగుతుంది. కాకపోతే ఈ ఛార్జర్ లో usb టైప్ - ఏ పోర్ట్  మాత్రమే ఉండడం గమనార్హం.


కానీ ఈ సోనిక్ చార్జర్ ను తయారుచేసిన షావోమి తమ పరికరంతో ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్, హెడ్ ఫోన్లు ఇలా మరెన్నో పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ ఛార్జర్ తో అనేక పరికరాలకు వేగంగా ఛార్జ్ చేయడం కోసం 67 W ఔట్ పుట్ ను కూడా అందిస్తోంది. షావోమి ఇదివరకు ఈ సంవత్సరం ప్రారంభంలో ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ చేసే విధంగా mi 11 అల్ట్రా ను మార్కెట్ లోకి విడుదల చేసిన  విషయం తెలిసిందే. కానీ ఇది కేవలం 55 W ఫాస్ట్ ఛార్జర్ ను  మాత్రమే అందించింది. ఇప్పుడు  కొత్తగా ప్రవేశపెట్టిన ఎమ్ఐ 67 W  సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ధర ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.1,999 నిర్ణయించబడింది.

ఇక దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు షావోమి అధికారిక వెబ్ సైట్ అయిన MI స్టోర్ లేదా mi హోమ్ స్టోర్ లో మనకు అందుబాటులో ఉంది. ఇక ఈ ఛార్జర్ 100 సెంటీమీటర్ల పొడవు కలిగిన 6A టైప్ సీ కేబుల్ తో  అందుబాటులోకి రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: