ఇప్పుడు ఎక్కువగా మనమందరం వంట కోసం గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నాము. అయితే ఇప్పుడు కొత్త కనెక్షన్ తీసుకునే వారికి, లేదంటే మరొక సిలిండర్ అదనంగా తీసుకోవాలనుకునే వారికి ఇప్పుడు ఒక శుభవార్త తీసుకువచ్చింది. అది ఏమిటంటే కేవలం ఇలా చేస్తే చాలు నిమిషాలలో సిలిండర్ ని పొందవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్త కనెక్షన్లు తీసుకోవాలనుకునే వారు కేవలం ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. కొత్త కనెక్షన్ ని పొందవచ్చు. ఈ సమాచారాన్ని స్వయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ..IOCL వెల్లడించింది.

ముఖ్యంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్ ని పొందాలనుకునే వారు..8454955555 అనే నెంబర్ కు జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. కొత్త కనెక్షన్ ని పొందవచ్చునని IOCL సంస్థ తెలుపుతోంది. ఇలా మన దగ్గర ఉన్న నెంబర్ తో మిస్డ్ కాల్ ఇచ్చాక.. ఆ నెంబర్ మన దగ్గర లోనే ఉండేటువంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి డైరెక్టుగా వెళుతుంది. ఆ తర్వాత మనకు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కాల్ చేస్తారట.

ఇక అందుకోసం మనం కేవలం వారికి కావలసిన అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వడం చేత మనకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రెండో సిలిండర్ కోసం మన దగ్గర ఉన్న పాత కనెక్షన్ అడ్రస్ ఫ్రూప్ ఇస్తే చాలట. ఇదంతా కేవలం ఇలాంటి సదుపాయాన్ని కొత్త కనెక్షన్ కోసం ఇండియన్ గ్యాస్ సంస్థ వారికి మాత్రమే ప్రవేశపెట్టింది. ఇంకా అంతే కాకుండా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే..7718955555 కాల్ చేస్తే ఆటోమేటిక్ గా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

కాకపోతే వాట్స్అప్ ద్వారా అయినా..7588888824 కు REFILL అని టైప్ చేసి వాట్సాప్ ద్వారా అయినా సిలిండర్ బుక్ చేసుకొని సదుపాయాన్ని కల్పించింది. ఇక ఇలాంటి మంచి మంచి సదుపాయాలను ఇంకా ప్రవేశపెట్టుతూనే ఉంటాము అన్నట్లుగా ఇండియన్ ఆయిల్ సంస్థ తెలియజేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: