ప్రముఖ బ్రాండెడ్ సంస్థ అయినటువంటి.. రీబాక్ తన మొట్టమొదటి స్మార్ట్ వాచ్ ను ఇండియాలో విడుదల చేయడం జరుగుతోంది.. ఈ స్మార్ట్ వాచ్ పేరు రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 అనే పేరుతో అమెజాన్ లో విడుదల చేయడం జరిగింది. ఈ వాచ్ రెడ్, బ్లూ, వీనీ, బ్లాక్ వంటి కలర్లో లభిస్తుంది.. దీని ధర రూ.4,499 రూపాయలు. దీనిని ఈ నెల 28వ తేదీన దీని సేల్ ప్రారంభం అవుతుంది. ఈ వాచ్ ఒక రోజు ఛార్జింగ్ చేస్తే..15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.Spo 2, హార్ట్ బీటింగ్ వంటి కొన్ని ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

REE BOCK ACTIVE FIT 1.0 SMART WATCH:
ఈ స్మార్ట్ వాచ్ 1.3 అంగుళాల హెచ్డీ డిస్ప్ ప్లే ను కలిగి ఉంటుంది.  ఇది రౌండ్ షేప్ తో కలదు.. ఈ వాచ్ IP 67 రేటింగ్ తో ఆ సంస్థ అందించనుంది. ఈ స్మార్ట్ వాచ్ ని డస్ట్, స్లాష్ అసిస్టెంట్ తో విడుదల చేయడం జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే.. మన మొబైల్ నుంచి ఎటువంటి కాల్స్, మెసేజ్ వంటివి వచ్చాయో వాటిని నోటిఫికేషన్ లతో తెలియజేస్తుంది. ఇక అంతే కాకుండా కెమెరా, మ్యూజిక్ కంట్రోల్ వంటివి ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.

అంతేకాకుండా యూజర్ ఆరోగ్య పరిస్థితి, ఫిట్ నెస్.. 24X7 హార్ట్ బీట్ సెన్సార్,spo 2 చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో సెకండరీ రిమైండర్ అనే ఫీచర్ ను కూడా సరికొత్తగా అందిస్తోంది. ఇందులో ఫిట్నెస్ కు సంబంధించి 15 ట్రాకింగ్ మోడల్స్ ను అమర్చారట. ఇక అంతే కాకుండా మహిళల కోసం ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఉన్నట్లుగా కూడా తెలియజేశారు. ఈ  స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ 15 రోజుల వరకు బ్యాక్ ప్ వస్తుంది అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: