ఇండియాలో ప్రధాన మోడీ 5జి నెట్వర్క్ సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది నగరాలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లుగా సమాచారం. త్వరలోనే దేశమంతట ఈ 5 జి నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీంతో వినియోగదారులకు 5g ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 5జి మొబైల్ ఉండి కూడా 5g నగరాలలో ఉన్నవారు తమ మొబైల్ ని 5g నెట్వర్ ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మీ నగరాలలో జియో, ఎయిర్టెల్ ,ఇతర టెలికాం కంపెనీ సంస్థల నుంచి 5జి అందుతూన్నట్లయితే.. మీ మొబైల్ లో 5g ని ఉపయోగించుకునేందుకు తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మీ ప్రాంతాలలో 5జి నెట్వర్క్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి.ఇందుకోసం మీ మొబైల్ ఆపరేటింగ్ లేదా కస్టమర్ కేర్ కాల్  చేసి అందు కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి..5g మొబైల్ లో ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి మొబైల్ నెట్వర్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.అక్కడ సిమ్ వన్ లేదా సిమ్ టు లో ఏదైనా నెట్వర్క్ ప్రోడక్ట్ పైన 5g అని సింబల్ చూపిస్తుంది. అందులో 5జి మొబైల్ సిమ్ ను ఎంచుకోవాలి.


అనంతరం ప్రీపెయిడ్ నెట్వర్క్ టైపులోకి వెళ్లి 54/4g/3g అనే ఆప్షన్ పైన ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ మొబైల్ ఆటోమేటిక్గా 5g సేవలను అందిస్తుంది. అయితే5g సేవలను ఉపయోగించుకోవాలి అంటే కొత్త సిమ్ము తీసుకోవాలని సందేహాలు కలుగుతూ ఉన్నాయి అందరిలో. అయితే కొత్తది అవసరం లేదు కానీ పాత సిమ్ ఉంటే సరిపోతుందని టెలికం దిగ్గజ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఇక కొన్ని ఆపరేటర్లు మాత్రం కొత్త సిమ్  కావాలని తెలియజేస్తున్నాయి. అయితే కచ్చితంగా ఫైవ్ జి మొబైల్ సపోర్ట్ చేసి మొబైల్ మాత్రం ఉండాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: