
సాదరణంగా కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు ఏదో ఒక అందమైన టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లి కాస్త ప్రశాంతంగా గడపాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు అన్ని ప్రదేశాలు చుట్టేసినవారు ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్తే ఎంత బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారి కోసమే ఇక ఇప్పుడు ఒక అదిరిపోయే ఆఫర్ సిద్ధంగా ఉంది. భూమ్మీద కాదు ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి చుట్టేసేందుకు ఛాన్స్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే అంతరిక్ష టూరిజం ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు.
2030 లోపు ఇస్రో శాస్త్రవేత్తలు ఇలా అంతరిక్ష టూరిజం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్నది తెలుస్తుంది. అయితే అంతరిక్షంలోకి టూరిస్ట్ గా వెళ్లాలి అంటే మాత్రం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రయాణికుడి నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. అయితే ఈ ధర ప్రపంచంలో ఉన్న స్పేస్ టూర్ ధరలతో పోల్చి చూస్తే చాలా తక్కువ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అంతరిక్ష టూరిజం అనే పదమే కాస్త కొత్తగా అనిపిస్తుంది కదా.