సాధారణంగా విమానాలు, హెలికాప్టర్లు గాలి లో ఎగురుతాయి అని తెలుసు.  అయితే మరి సముద్రంలో ప్రయాణించే  ఓడలు కూడా గాలిలో ఎగురుతాయా? గాలిలో ఎగిరే ఓడలు ఎక్కడ ఉన్నాయి. ఈ సందేహాలన్నీ మీకు తీరాలంటే  ఈ ఫోటోను ఒక సారి పరిశీలించండి. అయితే ఇందులో మీకు ఓడ గాలిలో ఎగురుతున్నట్టు గా కనిపిస్తోంది కదూ. అయితే ఇదేదో గ్రాఫిక్స్ అనుకోకండి. అది నిజమైన చిత్రమే. కాకపోతే అందులో ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ ఫోటో ఏమిటి? అందులో ఉన్న లాజిక్ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.


స్కాట్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి కారులో బీచ్ రోడ్ మీదుగా ప్రయాణిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఓ భారీ ఓడ దానికదే గాల్లో తేలడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.స్కాట్‌ల్యాండ్‌కు చెందిన 23 ఏళ్ల కొలిన్ మెక్‌కల్లమ్ బ్నాఫ్‌‌లోని బీచ్‌ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఇలాంటి దృశ్యాన్నే చూశాడు. అకస్మాత్తుగా సముద్రం వైపు చూడగా  ఓ ఓడ గాల్లోకి తేలుతూ కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన కొలిన్ అదంతా వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఆ ఓడ నిజంగానే గాల్లోకి ఎగురుతోందని మాత్రం అనుకోవద్దు. అది జస్ట్
దృష్టిభ్రాంతి.

ఔనండి, దృష్టిభ్రాంతి వల్ల మీకు ఆ ఓడ గాల్లోకి తేలినట్లు కనిపిస్తోంది. సముద్రం రంగు ఆకాశం రంగు ఒకేలా ఉన్నప్పుడు ఇలాంటి చిత్రాలు చోటుచేసుకుంటాయి. సుదూరంలో ఉండే సముద్రం ఆకాశం రంగులోను తీరంలో ఉండే నీరు ముదురు నీలం రంగులో ఉన్నప్పుడు ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద ఓడలు కేవలం మార్వెల్ అవేంజర్స్ సినిమాల్లో మాత్రమే ఎగురుతాయి. సూపర్ హీరోలు వాటిని ఆట బొమ్మల్లా గాల్లోకి ఎగరేస్తారు. మీకు కూడా ఇలాంటి విచిత్రం కనిపిస్తే  అది దృష్టిభ్రాంతి మాత్రమేనని తెలుసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: