మనం రోజుకు ఎన్నో వింత సంఘటనలు చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఇక నేటి సమాజంలో టెక్నాలజీ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. టెక్నాలజీని ఉపయోగించి కొత్తకొత్త వస్తువులను సృష్టిస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటె అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అని మరోసారి ఈ వ్యక్తి నిరూపించాడు. తన తెలివి తేటలతో తనలో దాగి ఉన్న సరికొత్త టాలెంట్ ని బయటపెట్టి అందరిచేత ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఏం క్రియేట్ చేశాడు..? ఎందుకు అతనిని మెచ్చుకుంటున్నారు అని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త చదివేయండి మరి.

తాజాగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి త‌న‌ షూ లేస్‌తో బీర్ బాటిల్ మూత తెరిచి అందరిని మైమరిపించాడు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యింది. సాధార‌ణంగా మద్యం సేవించేవారు బీర్ బాలిల్ మూత‌ను ఓపెన‌ర్‌తో లేదా ప‌ళ్ల‌తో లేదా బ‌ల్ల అంచున ఉంచి తీస్తారు. అయితే ఒక వ్య‌క్తి వినూత్న‌గా ఓపెన్ చేశాడు. హోల్డ్ మై బీర్ అనే ట్విట్ట‌ర్ ఖాతాదారుడు ఈ నెల 15న ఒక వీటియో పోస్ట్ చేశారు. అందులో ఒక వ్య‌క్తి త‌న బాటును బ‌ల్ల‌పై ఉంచుతాడు. బూటు లేస్‌ను బీర్ బాటిల్ మూత‌కు చుట్టి గ‌ట్టిగా లాగుతాడు. దీంతో ఆ బీర్ బాటిల్ మూత తెరుచుకుంటుంది. మ‌న‌సు ఉంటే మార్గం ఉంటుంది అని ఈ వీడియోకు ఆయ‌న‌ శీర్షిక‌ పెట్టారు.

అయితే మ‌రోవైపు ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్ చేశారు. జీనియ‌స్ అని అత‌డిని కొనియాడారు. ఈ ఆలోచ‌న నాకు ఎందుకు త‌ట్ట‌లేదు అని ఒక‌రు ప్ర‌శ్నించుకున్నారు. బీర్ బాటిల్ ఓపెనింగ్ వ‌స్తువుల‌ కేట‌గిరిలో మ‌రొక‌టి చేరింది అని ఒక‌రు ‌చ‌మ‌త్క‌రించారు. ఇలా అందరి చేత ఆ వ్యక్తి ప్రశంసలు అందుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: