రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక అవసరాల కోసం కొత్తగా తయారు చేసిన ఓ విమానాన్ని మిలటరీ అధికారులు పరీక్షిస్తుండగా... ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతే గాల్లోనే చక్కర్లు కొడుతూ... విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ఆర్మీ అధికారులు వెల్లడించారు. రష్యా రాజధాని మాస్కోకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. రష్యా సైనిక అవసరాల కోసం ఓ తేలికపాటి రవాణా విమానాన్ని రూపొందించారు. దీనిని మాస్కో సమీపంలోని కుబింకా ఎయిర్ ఫీల్డ్ లో పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

అనుకున్న ప్రకారమే టేకాఫ్ తో పాటు... గాల్లో అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న విమానం... ల్యాండింగ్ సమయంలో మాత్రం ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. అంతే ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. మంటలతోనే గాల్లో ప్రయాణం చేసిన విమానం... ఆ తర్వాత తల్లకిందులై కిందపడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు సహా ఫ్లైట్ ఇంజినీర్ కూడా మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రష్యా ఎయిర్ ట్రాఫిక్ అథారిటీ అధికారులు ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించారు. మిలటరీ సిబ్బంది, పరికరాలు, ఆయుధాల రవాణా కోసం ఇల్యూషిన్ అనే సంస్థ ఈ విమానాన్ని తయారు చేసి... రష్యన్ కు ఎయిర్ ఫోర్స్ కు అందించింది. ఈ నెలాఖరులో జరిగే ఆర్మీ-2021 కార్యక్రమంలో ఈ కొత్త విమానాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విమానాన్ని పరిక్షించి పరిశీలిస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంపై రష్యన్ మిలటరీ అధికారులు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం కూడా ప్రమాదంపై లోతైన దర్యాప్తు కోసం ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: