సాధారణంగా జనరేషన్ గ్యాప్ అనే మాట అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలను చూస్తే ప్రస్తుతం 25 - 30 ఏళ్లలో ఉన్నవారు ఇదే జనరేషన్ గ్యాప్ అంటే అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేటి రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలకు సైతం సూపర్ ఫాస్ట్ గా కనిపిస్తూ ఉంటారు. వారి నాలెడ్జి చూసి అందరూ అవాక్కవుతారు. ఇక్కడ ఇంకా 2 ఏళ్లు కూడా నిండని బుడ్డోడు తన టాలెంటుతో అవాక్కయ్యేలా చేస్తున్నాడు. సాధారణంగా రెండేళ్ల వయసున్న పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటారు..


 ఇక రెండేళ్ల చిన్నారులు ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తు ఉంటాయి.. కానీ ప్రస్తుతం కంప్యూటర్ యుగానికి  తగ్గట్లుగా 18 నెలల బుడ్డోడు తన టాలెంట్ తో అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. కనీసం నోట్లో నుంచి సరిగ్గా మాటలు రాని వయసులో అన్ని మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు 18 నెలల బుడ్డోడు తన టాలెంటుతో గూగుల్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. జార్ఖండ్లోని గిరిధి మండలంలో ఒక మారుమూల గ్రామం కబ్బరి.. రవాణా సౌకర్యాలు స్కూల్ సౌకర్యం కూడా లేదు. అలాంటి  గ్రామంలో పుట్టిన ఈ బుడ్డోడు పుట్టుకతోనే నాలెడ్జ్  సంపాదించుకున్నాడు.


 ఈ బుడ్డోడి టాలెంట్ చూస్తే అటు మేధావులు సైతం షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ పుస్తకం గా మారిపోయాడు ఈ ఏడాదిన్నర చిన్నోడు. పక్షులు జంతువులు పువ్వులు కాయలు పేర్లు టకటక చెప్పేస్తున్నాడు.. అంతేకాదు ప్రధాన మంత్రి ముఖ్య మంత్రి రాష్ట్రం రాజధాని పేర్లు సైతం చెప్పేస్తున్నాడు. ఈ చిన్నారి అసలు పేరు అంకుష్ రాజ్. ఇతని తండ్రి అశోక్ యాదవ్ ఒడిశాలో ట్రక్ డ్రైవర్ గా పని చేస్తాడు. తల్లి ఉషభారతి హౌస్ వైఫ్. ఏదేమైనా ఇక ఈ 18 నెలల బుడ్డోడు టాలెంట్ చూసి ప్రస్తుతం అందరూ అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: