చిన్న పిల్లలు ఏదైనా కలర్ఫుల్ కనిపిస్తే వాటిని తీసుకొని వెంటనే నోటిలో పెట్టుకుంటారు. ఒక్కోసారి వాటిని అలాగే మింగెస్తారు. అవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తీసుకువస్తుంది. అంతేకాదు ప్రాణాలు కూడా పోతాయి. అందుకే వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. లేకుంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే ఒక మనిషి పిల్లలను చూసుకుంటూ ఉండాలి. ఎంతగా గమనిస్తూ ఉన్న ఎమరపాటు ప్రానాలను పొగొట్టుకున్నారు..
తాజాగా ఓ ఘటన అందరినీ కాసేపు టెన్షన్ పెట్టించింది. ఓ చిన్నారి ఆడుకుంటు జెండు బామ్ డబ్బాని మింగెసాడు. దాంతో ఒక్కసారి గుక్క పెట్టి ఏడ్పు మొదలు పెట్టాడు. భయపడిన తల్లి దండ్రులు పాపాయిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చాలా కష్టపడి దాన్ని బయటకు తీసారు. వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.అనంతపురం కదిరిలొ చోటుచేసుకుంది. నగరం లో మెంతో ప్లస్ డబ్బా మింగిన తొమ్మిది నెలల చిన్నారిని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ప్రాణాల తో కాపాడారు. ఈ ఘటన గత రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా వలిసాబ్ రోడ్ సహామీరియా వీధిలో ఇంటిలో ఆడుకుంటున్న చిన్నారి ఒక చేతికి జండూ బామ్ డబ్బా దొరింది.
దాన్ని తినే పదార్థంగా భావించి నోట్లో వేసుకుంది. అది కాస్త గొంతులో చిక్కుకోవడం తో పాప బాగా ఏడుస్తోంది. ఇది గమనించిన తల్లితండ్రులు ఒక్కసారిగా టెన్షన్ కు గురయ్యారు. ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారిని వెంటనే నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. దాదాపు గంటసేపు శ్రమించి చిన్నారి గొంతులో నుంచి మెంతో ప్లస్ డబ్బాను తీసి చిన్నారి ప్రాణాలును కాపాడారు. మొత్తానికి చిన్నారి ప్రాణాల తో బయట పడింది. దాంతో పాప తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. ఇప్పుడు చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
మరింత సమాచారం తెలుసుకోండి: