నగరాలలో రౌడీలు, పేకాట రాయుళ్లు అనే మాట ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఇక వారిని కట్టడి చేయడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేసినప్పటికీ వారిని అరికట్టలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో బెజవాడ పోలీసులు ఒక వినూత్నంగా ఆలోచించడం జరిగింది. రౌడీయిజం కారణంగా కొంతమంది తమ భవిష్యత్తు కోల్పోయిన వారికి సమాజంలో గౌరవంగా బతికే లా చర్యలు చేపడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రౌడీషీటర్ ల కోసం జాబ్ మెళా నిర్వహించడం జరిగింది.

విజయవాడలోని రౌడీషీటర్ల సమస్య ఎప్పటినుంచో ఉన్నది వారితో మాట్లాడే సమయంలో వారి గురించి కొన్ని సమస్యలను అర్థం చేసుకున్నామని ci కాంతిరాణా టాటా తెలియజేశారు. అందుకోసమే అలాంటి వారి కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామనడంతో ఎంతో మంది ముందుకు వచ్చారట. పాత జీవితాన్ని వదిలేసే సరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీషీటర్లు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 16 కంపెనీలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం. అలా కంపెనీలు ఒప్పుకోవడంతో సిఐ ఎంతో సంతోషించారు. సిఐ మాట్లాడుతూ.. యువత కూడా తమ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరం సమానమే.. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు అని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కేవలం విద్య ద్వారానే అభివృద్ధి చెందుతాయని తెలిపారు.


పాత జీవితాన్ని వదిలేసి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్న రౌడీషీటర్లకు ci కాంతిరాణా టాటా కొన్ని సూచనలు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఇక అంతే కాకుండా విజయవాడలో గతంలో అరాచక శక్తులకు అడ్రస్ గా ఉండేదని.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని తెలియజేశారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇక CI కాంతిరాణా టాటా వచ్చిన తర్వాత ఈ విజయవాడలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. తప్పు మార్గంలో ప్రయాణించే వారిని.. అది సరైన మార్గం కాదని చెప్పి వారికి జీవన ఉపాధి కల్పించడంలో చాలా సంతోషమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: