అధికారం చేతిలో ఉంది కదా అని ఏది చేసిన అడిగే వాళ్ళు లేరు అనుకొని చాలామంది ప్రజల పై పెత్తనం చెలాయిస్తున్నారు. వారికి నచ్చిన విధంగా చేస్తున్నారు. ప్రజలు నిజంగా మన పాలన లో హాయిగా వున్నారా అనే ఆలోచన కొద్దిగా కూడా లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్థిస్తున్నారు.పేదల చెమటను సొమ్ము చేసుకొని పూట గడుపుతారు.. నాయకులు చెప్పిన మాటలను అధికారులు కూడా తల ఆడిస్తూ వస్తున్నారు.వాళ్ళ మధ్యలో పేద వాళ్ళు బలి అవుతున్నారు. తాజాగా జరిగిన ఘటన అందుకు నిదర్శనం..ఓ మామూలు టీ కొట్టు అతనికి ఇంటి పన్ను, ఆస్తి పన్ను కలిపి ఏకంగా లక్షన్నర కావడంతో అతనికి గుండె ఆగినంత పని అయ్యింది.


అతని స్థితిని చూసిన అధికారులు ఇలా అతని పై కక్ష్య కట్టడంతో జనాలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.గతంలో అద్దె ఆధారంగా ఆస్తిపన్ను వసూలు చేసేవారు. కానీ, జగన్‌ సర్కారు దానికి మార్చేసింది. నిర్మాణ విలువ ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తోంది. ఇప్పుడు నిర్మాణాల విలువ పెంపుతో… రిజిస్ట్రేషన్‌ చార్జీలతోపాటు ఏటా వసూలు చేసే ఆస్తిపన్ను కూడా పెరుగుతుంది. రివైజ్‌ చేసిన నిర్మాణాల రేట్లను జూన్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రమంతా అమలు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో మున్సిపల్‌ అధికారులు విధిస్తున్న ఆస్తి పన్ను చూస్తే గుండెల్లో గుబులు రేపుతోంది. ఎందుకంటే, చిన్నపాటి గుడిసెలు, తడకల ఇళ్లకు కూడా లక్షల్లో ఆస్తిపన్ను విధిస్తున్నారు మున్సిపల్‌ అధికారులు..

చుట్టూ చెక్క తడకలతో ఏర్పాటు చేసిన ఓ చిన్నపాటి టీ కొట్టు. కానీ గ్రామపంచాయతీ అధికారులు మాత్రం కనీస కనికరం లేకుండా ఈ గుడిసెకు రూ.1,33,810లు పన్ను విధించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరు ముక్కున లేసుకుని నివ్వెరపోతున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని ఓ గుడిసెకు ఒక లక్షా 33వేల, 810 రూపాయల ఆస్తి పన్ను విధించారు అధికారులు. ఇందులో అసలు 73వేల 501 రూపాయలు కాగా, దానికి వడ్డీ కింద 41వేల 383 రూపాయల ఆస్తి పన్ను చెల్లించాల్సిందిగా అధికారులు నోటీసులిచ్చారు..ఈ ఏడాదికి కూడా ఆస్తి పన్ను వేసి మరి నోటిసులు పంపడం విశేషం..ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: