
సాధారణంగా పుణ్యస్నానాలు ఆచరించడం కి వెళ్ళిన సమయంలో ఎవరైనా సరే ఎంతో పవిత్రంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో నిష్టతో పుణ్యస్నానాలు ఆచరించడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వ్యక్తి మాత్రం ఇలా పుణ్య స్నానం చేయడానికి వెళ్లి ఏకంగా భార్య అందాన్ని చూసి ఒక్క సారిగా మైకం లో మునిగిపోయాడు. దీంతో తాను ఎక్కడ ఉన్నాను అన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. చుట్టుపక్కల అందరూ ఉన్నారు అన్న విషయాన్ని మరచిపోయి భార్యకు డీప్ లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారందరూ ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇక భార్యకు ముద్దు పెట్టాడు అనే కారణంతో చివరికి అతన్ని అసభ్య పదజాలంతో తిడుతూ కొట్టారు. ఉత్తర ప్రదేశ్లోని ప్రముఖ పుణ్యస్థలం శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయోధ్య లో ప్రవహించే పవిత్రమైన ఆ సరయు నది లో ఓ జంట స్నానం చేయడానికి దిగింది. భర్త తన భార్యకు లిప్ కిస్ పెట్టాడు. అయితే ఇక ఇది గమనించిన చుట్టుపక్కల ఉన్న వారి తీరును తప్పుబట్టారు. అతడిని నది నుంచి పక్కకు లాగి తిట్టడంతో పాటు చేయిచేసుకున్నారు. అయోధ్యలో ఇలాంటి పనులు చూస్తే సహించబోమని అంటూ అతడిని హెచ్చరించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.