సాధారణంగా మనుషులకు మాత్రమే తెలివి  ఉంటుందని.. ఏ విషయంలో అయినా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్నో సార్లు అటు జంతువులు కూడా మనుషుల కంటే తెలివిగా ఆలోచిస్తాయ్ అన్న విషయం పలు వీడియోలలో నిరూపితం అవుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని అటు ప్రకృతిలోని ఎన్నో జీవాలు ఆహారాన్ని  సంపాదించుకోవడానికి ఎంతో తెలివిగా వ్యవహస్థాయి అన్న దానికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనుషులే కాదు పక్షులు జంతువులు కూడా ఎంతో తెలివిగా ఆలోచిస్తాయ్ అన్నది మాత్రం అర్థమవుతూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో పక్షి తన ఆహారం సంపాదించుకోవడం కోసం ప్రదర్శించిన తెలివిని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అని చెప్పాలి.  ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక కొంగ నది ఒడ్డున నిలబడి చేపలను ఆహారంగా చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఈ నీటిలో ఉన్న చేపలు ఊరికే దొరకవు కదా. దీని కోసం ఒక ప్లాన్ వేసింది ఆ కొంగ. నీటిలో ఉన్న చేపలను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ప్లాన్ అమలు చేసి ఇక పైకి వస్తున్న చేపలను తన నోటితో ఎంతో షార్ప్ గా పట్టుకొని గుటుక్కున మింగేస్తుంది.


 దీనికోసం ముందుగా ఒక రాయిపై నిలబడి తెల్లటి ముక్కలను నీళ్లలో వేస్తోంది. అది చూసిన చేపలు అది ఆహారం అనుకోని తినడానికి పైకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలా నీటి లోపలి నుంచి పైకి వస్తున్న చేపలను  పక్కనే చూస్తూ కూర్చుంది సదరు హంటర్ బర్డ్. చివరికి ఒక చేప పైకి రాగానే లటుక్కున పట్టేసుకొని గుటుక్కున మింగేసింది. హంటర్ బర్డ్ టెక్నిక్స్ చూసిన నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్లో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: