సోషల్ మీడియా అనే ప్రపంచంలో ప్రతి రోజు ఎన్నో రకాల వీడియోలు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలలో మనసును ఆహ్లాద పరిచే విధంగా ఉండే వీడియోలు కొన్ని అయితే.. ఆశ్చర్యపరిచే వీడియోలు మరికొన్ని. కొన్ని వీడియోలు అయితే కాస్త భయపెడుతూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పక్షులు జంతువులకు సంబంధించిన వీడియోలు ఏవైనా సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే చాలు అవి కేవలం నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఈ సృష్టిలో ఎన్ని రకాల పక్షులు ఉన్న రామచిలకలు మాత్రం కాస్త భిన్నమైనవి.


 మనుషులకు బాగా దగ్గర అయినవి. ఎందుకంటే చూడటానికి అందంగా ఉండటమే కాదు మనుషులతో మనుషుల్లాగా మాట్లాడటం కూడా చేసి ఒక రామచిలక పక్కన ఉంటే మనతో పాటు ఒక మనిషి తోడుగా ఉన్నాడేమో అనే మంచి ఫీల్ ఇస్తూ ఉంటాయి రామచిలకలు. ఇక మనుషుల స్వరాన్ని రామచిలుకలు ఎంతో కచ్చితంగా అనుకరించడం లాంటి వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో చక్కర్లు కొట్టాయ్. ఇక ఎంతో అందంగా ఉన్న రామచిలక కాస్త ఏకంగా కుక్కలా మొరగడం మొదలుపెట్టింది. ఇక రామచిలుక ఇలా కుక్కల మొరగడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఒక ఇంట్లో యజమానులు రామచిలకతో పాటు ఒక చిన్న క్యూట్ కుక్కను కూడా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు స్నేహితులు అయ్యాయ్. అయితే కుక్క లేజీ గా పడుకున్న సమయంలో కుక్కను లేపేందుకు రామచిలక ప్రయత్నించింది. ఈ క్రమంలోనే తన ముక్కుతో కుక్కను పొడుస్తూ ఉండడమే కాదు కుక్కల అరవడం చేసి భయపెట్టాలి అని అనుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో నెటిజెన్లు  రామచిలుక అచ్చం కుక్కల అరవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: