సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు తెరమీదకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులు జాతి వైరాన్ని సైతం మరిచిపోయి ఎంతో ఆప్యాయంగా ఉండడం లాంటివి ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు ఎప్పుడైనా సోషల్ మీడియాలోకి వచ్చాయంటే చాలు అవి నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక అలాగే సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని వీడియోలు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయని చెప్పాలి..


 ఇక ఇప్పుడు అందరినీ కడుపుబ్బా నవ్వించే ఒక వీడియో కాస్త ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సాదరణంగా ఎప్పుడు కోతులు చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కోతి చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా గుర్రంపై స్వారీ చేయడం మాత్రమే ఇప్పటివరకు అందరం చూసాము. కానీ ఇక్కడ ఒక కోతి మాత్రం ఏకంగా జింకపై స్వారీ చేస్తుంది. కోతి జింకపై స్వారీ చేయడమేంటి ఇదేదో ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.. ఇది నిజంగానే జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ క్యాంపస్ లో ఈ ఘటన జరిగింది.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే క్యాంపస్ లో ఒక జింక గడ్డి మేస్తూ కనిపిస్తుంది. అయితే జింకపై హాయిగా కూర్చున్న కోతి ఇక ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంది. ఏకంగా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది. అయితే కోతి జింకపై కూర్చున్నప్పటికీ ఆ జింక మాత్రం ఏ మాత్రం బెదరలేదు. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు జంతువుల మధ్య ఉన్న స్నేహబంధం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: