సాధారణంగా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం కోసం కొన్ని ఏళ్లపాటు కష్టపడి ఒక ప్రత్యేకమైన ప్రతిభను తమలో నింపుకొని ఇక గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ బుక్ రికార్డుల్లో చూసుకుంటే ఎక్కువ ఎన్నో విచిత్ర విచిత్రమైన పనులు చేసి రికార్డులు సాధించిన వారు చాలామంది ఉంటారు. ఈ క్రమంలోనే రికార్డు సాధించడం కోసం వారు చేసిన పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి.


 అయితే ఇక మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఇప్పటివరకు గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఏకంగా కొబ్బరికాయలు పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక్క నిమిషం వ్యవధిలో ఏకంగా మార్షల్ ఆర్టిస్ట్ నుంచాకుతో 42 కొబ్బరికాయలను పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త యూట్యూబ్లో తెగ చక్కర్లు  కొడుతుంది అని చెప్పాలి. ఇక అతను ఎంతో చాకచక్యంగా కొబ్బరికాయలను పగలగొట్టిన తీరు అందరిని ఫిదా చేస్తుంది.


 మార్షల్ ఆర్టిస్ట్ కెవి సైదలవి ఆరుగురు వాలంటీర్లు కూడా వృత్తాకారంలో కూర్చుని తమ తలపై కొబ్బరికాయలు ఒక్కొక్కటిగా పెట్టుకోగా.. అతను నుంచాకుతో కొబ్బరికాయలను  కొట్టడాన్ని చూపించారు. ఇక మార్షల్ ఆర్ట్స్ లో అయిదు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సైదలవి.. ఇప్పటికే తన ప్రతిభను నిరూపించి నాలుగు రికార్డులను సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఒకే నిమిషంలో 42 కొబ్బరికాయలు కొట్టడం కొత్త రికార్డు సాధించాడు. అంతకుముందు ఒక్క నిమిషంలో 84 కోక్ టిన్స్ చేతితో చూర్ణం చేయడం.. ఇక ఒక నిమిషంలో అత్యధిక కాంక్రీట్ బాక్సులను బద్దలు కొట్టడం లాంటి రికార్డులు కూడా అతని పేరిటే ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: